లైఫ్ స్టైల్

కష్టానికి గుర్తింపే…మే డే – zptc సభ్యుడు శ్రీకాంత్

తెలుగునంది కందుకూరు:  రాష్ట్ర మరియు పట్టణ  ప్రజలకు  మే డే శుభాకాంక్షలు తెలిపిన  zptc సభ్యుడు శ్రీకాంత్ కంచర్ల. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘మే డే’ ఒక చారిత్రాత్మక చైతన్య దినం. ప్రపంచాన్ని నడిపించడం కోసం కార్మికులు.. సూర్యచంద్రుల్లా పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటారు. పొద్దున్న కోడి కూయక ముందే నిద్ర లేసి.. కష్టం తోవ పడుతారు. పొద్దు పోయినక రాత్రికి ఇంటికి తిరిగి వస్తారు. అలాంటి కార్మికులు తమ హక్కుల కోనం రక్తార్పణం చేసి కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికి కొత్త వెలుగులు అందించిన చరిత్ర మే డేకు ఉంది. ఏదేమైనా కార్మికుల శ్రమను  మనందరం గౌరవించాలని శ్రీకాంత్ తెలిపారు.

Add Comment

Click here to post a comment