లైఫ్ స్టైల్

కేరళ ఫ్లడ్ రిలీఫ్ ఫౌండ్ & డొనేషన్ క్యాంపు లో శ్రీకాంత్ యువసేన టీం సేవలు బేష్

తెలుగునంది హైదరాబాద్ : పర్యాటక స్వర్గధామం, దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన కేరళ వరణుడి ప్రకోపానికి విలవిల్లాడుతోంది. తొమ్మిది రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న కేరళ వాసులకు సాయం చేసేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు, మీడియా సంస్థలు, బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.

ప్రస్తుతం కేరళ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. 80 శాతానికి పైగా కేరళ భారీ వర్షాలకు, వరదలకు మునిగిపోయింది. దీంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయులందరినీ పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. వరదలకు అతలాకుతలమవుతున్న కేరళ రాష్ర్టాన్ని ఆదుకోవడానికి ప్రధాని మోదీ తక్షణ సాయం కింద రూ.500 కోట్లు ప్రకటించారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 కోట్లు ప్రకటించారు.

కాగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేవామిత్ర నాయకత్వ శిక్షణా శిబిరం డైరెక్టర్ మరియు కందుకూరు జడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ కంచర్ల ఆదేశాల మేరకు … శ్రీకాంత్ యువసేన టీం  వరద బాధితులకు తమ వంతు సాయం గా 5000/-  అండ్ తాగు నీరు 500 bottles  డొనేట్ చేశారు. అంతేకాకుండా నిన్న రవీంద్ర భారతి లో నిర్వహించిన కేరళ ఫ్లడ్ రిలీఫ్ ఫౌండ్ & డొనేషన్ ప్రోగ్రాం లో వాలంటీర్స్ గా మధ్యానం నుంచి రాత్రి 8 గంటల వరకు తమ సేవలు అందించారు… ఈ మేరకు ములయాలి అసోసియేషన్ చైర్మన్ అయీనా బెంజిమన్ నాయర్ మరియు వెంకటేశం IAS, Secretary Tourism, Language & Culture govt of telangana చేతుల మేదుగా శ్రీకాంత్ టీం కి ఉత్తమ సేవ సర్టిఫికెట్లు అందజేశారు. శ్రీకాంత్ టీం, మెంబెర్ అయిన సాయి మాట్లాడుతూ  కంచర్ల ఫౌండేషన్ అధినేత ఐన  శ్రీకాంత్ గారు కంచర్ల ఫౌండేషన్ & రోటరీ క్లబ్ & ఎన్టీఆర్ ట్రస్ట్ ల సహకారంతో ఎన్నో సేవ కార్యక్రమాలను నిర్వహించారు వారి సేవలను గుర్తించి మంత్రి నారాయణ గారి నుంచి సేవ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.

Add Comment

Click here to post a comment