లైఫ్ స్టైల్

జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలకు 10వేల విరాళాన్ని ఇచ్చిన కంచర్ల ఫౌండేషన్ అధినేత శ్రీకాంత్ కంచర్ల

తెలుగునంది ప్రకాశం : కందుకూరు, జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవం లో భాగంగా ప్రకాశం జిల్లా యువనాయకులు మరియు కంచర్ల ఫౌండేషన్ అధినేత శ్రీకాంత్ కంచర్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కి రూ.10 వేల చెక్కును అందజేశారు. ఈ డబ్బును పాఠశాలలో అవసరమయ్యే పరికరాలను , సామాగ్రి కొనుగోలు చేసేందుకు ఇచ్చారని తెలిపారు.  ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చెందాలని శ్రీకాంత్ ఆకాంక్షించారు. శ్రీకాంత్ గారి ఉదార మనస్సుతో చేసిన ఆర్థిక సహాయానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.