లైఫ్ స్టైల్

నాన్నను ఫాదర్స్ డే రోజు మాత్రమే గుర్తు చేసుకోవడం.. కాదు.. సంవత్సరంలో 365 రోజులూ ప్రేమిద్దాం- శ్రీకాంత్

తెలుగునంది ఫాదర్స్ డే స్పెషల్:  నేడు ఫాదర్స్ డే సందర్భంగా ను  మా టీం ప్రకాశం జిల్లా యువనాయకులు & చైర్మన్ ప్రకాశంజిల్లా జడ్పీటీసీ సభ్యులసంఘం మరియు యూత్ ఐకాన్ శ్రీకాంత్ కంచర్ల గారిని కలిసింది…

శ్రీకాంత్ మాట్లాడుతూ ముందుగా అందరికి ఫాదర్స్ డే  శుభాకాంక్షలు..నాన్నంటే? తెలియదు. చేయి పట్టుకుని నడక నేర్పినప్పుడు..గాల్లోకి ఎగరేసి ఆడించినప్పుడు..గాయం చేసిన గడపని కొట్టినప్పుడు.. అమ్మకు తెలియకుండా ఐస్‌క్రీమ్ కొనిచ్చినప్పుడు.. కీ ఇచ్చి బైక్ నడపమని వెనకాల కూర్చున్నప్పుడు.. ఎప్పుడూ తెలియదు.. నాన్నంటే ఏంటో.. నువ్వు నాన్న అయ్యాకే తెలుస్తుంది.
కని, పెంచే.. కనిపించే దేవత అమ్మ అయితే.. నడిపించే దైవం నాన్న!ప్రేమించడం అమ్మ వంతయితే..
దీవించడం నాన్న వంతు. అమ్మ అమృతమైతే.. దాన్ని నింపే కలశం నాన్న. అమ్మ వెలిగే దీపమైతే నాన్న దాన్ని వెలిగించే వత్తి. నాన్నంటే.. భద్రత.. భరోసా.. బాధ్యత. నాన్నంటే ఒక రిలేషన్ మాత్రమే కాదు.. ఎప్పటికీ అర్థం కాని ఓ ఎమోషన్. ఆయన మనసు అర్థం కాని అంతరిక్షం. ఆయన హృదయం తెలుసుకోలేని అనంత సాగరం..మన భారతీయులందరికీ కూడా.. ఒక డే అనే దాని మీద పెద్దగా నమ్మకం లేదని నాకనిపిస్తుంటుంది. ఫిబ్రవరి 14న మాత్రమే ప్రేమించడం.. అలాగే అమ్మని మదర్స్ డే రోజే పూజించడం.. నాన్నను ఫాదర్స్ డే రోజు మాత్రమే గుర్తు చేసుకోవడం.. కాదు.. సంవత్సరంలో 365 రోజులూ ప్రేమిద్దాం.  .. నడిపించే నా దైవం  డాక్టర్ కంచర్ల రామయ్య గారికి (నాన్న) కు.. ప్రేమతో…అన్ని శ్రీకాంత్ తెలిపారు..

Add Comment

Click here to post a comment