లైఫ్ స్టైల్

నేడు ఆంధ్రకేసరి జయంతి… స్మరించుకున్న రాష్ట్ర సేవామిత్ర నాయకత్వ శిక్షణా శిబిరం డైరెక్టర్ శ్రీకాంత్

తెలుగునంది కందుకూరు : తెలుగు వారిలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రభాగాన ఉంటారని రాష్ట్ర సేవామిత్ర నాయకత్వ శిక్షణా శిబిరం డైరెక్టర్ మరియు కందుకూరు జడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ కంచర్ల కొనియాడారు. గురువారం ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శ్రీకాంత్ ఆయనను స్మరించుకున్నారు. ఒక్క భారతీయుడూ లేని సైమన్‌ కమిషన్‌ను వ్యతిరేకించిన ప్రకాశం పంతులు ‘సైమన్‌ గో బ్యాక్‌’ అంటూ రణగర్జన చేశారని అన్నారు. గాంధీజీ పిలుపు మేరకు ఆనాడు ఆంధ్రావనిలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారని, తెలుగు వారంతా ఆయనను ‘ఆంధ్ర కేసరి’గా గౌరవించారని చెప్పారు. ప్రజల కష్టాలకు చలించి, బ్రిటిష్‌ పాలకుల దురాగతాలకు జ్వలించిన నిష్కళంక దేశభక్తుడు ప్రకాశం పంతులు అని శ్రీకాంత్ కీర్తించారు. ఆదాయం తెచ్చిపెడుతున్న న్యాయవాద వృత్తిని వదిలేసిన ఆయన దేశం కోసం తన కష్టార్జితాన్ని ధారపోశారని చెప్పారు.

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్ర పండుగగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం అన్ని శ్రీకాంత్ తెలిపారు.

Add Comment

Click here to post a comment