లైఫ్ స్టైల్

ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన అంశం నైతికత. నైతికత అంటే ఏమిటి?

తెలుగునంది : ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన అంశం నైతికత. నైతికత అంటే ఏమిటి? దీనికి సార్వత్రిక, సార్వజనీనమైన నిర్వచనం ఏదైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. ప్రదేశం, కాలమాన పరిస్థితులను బట్టి నైతికత లేక నైతిక విలువలు మారుతూ ఉంటాయి. పూర్వం బలమున్నవాడిదే రాజ్యం. బలమున్న రాజు, పక్కవాడి రాజ్యాన్ని ఆక్రమించుకోవడం రాజధర్మంలో భాగమే. మరి అది ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో దురాక్రమణగా పేర్కొంటున్నారు. కొన్ని మతాల్లో బహు భార్యత్వం సమ్మతమే. కానీ చాలా మతవిశ్వాసాలు దాన్ని తప్పంటున్నాయి. కొందరు అక్క కూతుర్ని పెళ్ళాడవచ్చంటారు. మరికొందరేమో అది అనైతికమంటారు. పెళ్ళికాకుండా లైంగిక సంబంధం కలిగి ఉండటం చాలా సమాజాల్లో అనైతికం. కానీ కునామా వంటి ఆఫ్రికా తెగల్లో అమ్మాయి పెళ్ళిచేసుకోవాలనుకున్నవాడి లైంగిక సామర్థ్యం కొన్ని రాత్రులు అతడితో గడపడం ద్వారా నిర్థారించుకుని ఇష్టమైతే మనువాడుతుంది. లేకపోతే పొమ్మంటుంది. తల్లిదండ్రులను, ఇతర వృద్ధులను గౌరవించి అవసాన కాలంలో జాగ్రత్తగా చూసుకోవడం భారతదేశంలో నైతిక విధి. కానీ చాలా పాశ్చాత్యదేశాల్లో వృద్ధులైన తల్లిదండ్రులను, తాత అమ్మమ్మలను హాస్టళ్ళలోనో, వేరే ఇళ్ళలోనో ఉంచే సంతానం కనిపిస్తుంది. అది అక్కడ అనైతికం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే నైతికత అనేది అనాది నుంచి ప్రాంతాన్ని, సమాజాన్ని బట్టి మారుతూనే ఉందని అర్థమవుతుంది.

Add Comment

Click here to post a comment