లైఫ్ స్టైల్

మీ మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ఉన్నాయా? అయితే ఇది చదవండి!

తెలుగునంది న్యూస్: నిరుపేదలకు రుచికరంగా, సంతృప్తిగా మూడుపూటలా భోజనం అందించేందుకు ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం తొమ్మిదో డివిజన్‌లోని పటమట రైతుబజార్‌ పక్కన ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను మంత్రి ఉమామహేశ్వరరావు, మేయర్‌ కోనేరు శ్రీధర్‌, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ క్యాంటీన్‌ సమీపంలోని రైతుబజార్‌కు వచ్చే రైతులు, వినియోగదారులు, సామాన్య ప్రజలకు క్యాంటీన్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 750 అన్న క్యాంటీన్లను నిర్మించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో సంక్రాంతి నాటికి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. మేయర్‌ కోనేరు శ్రీధర్‌, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో అందించే ఆహారం నిర్ణీత వేళల్లో వివిధ పనులపై నగరానికి వచ్చేవారికి అందించేందుకు ఉపయోగపడుతన్నాయన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.నివాస్‌, కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Add Comment

Click here to post a comment