లైఫ్ స్టైల్

వరలక్ష్మీ వ్రతం వెనుక వైద్య రహస్యాలు.అవి ఏంటో చూడండి మీరు..

తెలుగునంది న్యూస్: శ్రావణ మాసంలో ఆచరించే నోముల్లో అనేక అర్థాలు, పరమార్థాలు, వైద్యపరమైన రహస్యాలు దాగివున్నాయి. వ్రతాల్లో వాడే పసుపుకుంకుమలు శుభప్రదమే కాదు ఆరోగ్యదాయనిలు. పసుపులో క్రిమిసంహారక లక్షణాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వర్షాకాలంలో పనుల పరంగా స్త్రీలు ఎక్కువగా నీటిలో తిరుగుతారు. అందువల్ల ఫంగల్‌ ఇన్‌స్పెక్షన్లు సోకే అవకాశం ఉంది. పాదాలకు పసుపు రాసుకుంటే దీన్ని నివారించవచ్చును. ముఖానికి పసుపు రాయడం వల్ల ఛాయ పెరుగుతుంది. మొటిమలు, పొక్కులు పోతాయి. నోము నోచిన వారు నానబెట్టిన శనగలు వాయినంగా ఇస్తారు. శెనగల్లో పోషక విలువలు పుష్కలం. విటమిన్‌ ఎ, సీ, ఇతోపా బి కాంప్లెక్స్‌ లభిస్తాయి. తాంబూలం వేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. వ్రతం సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల పండ్లను నివేదన చేసి వాటిని ఇంటిలోని పిల్లాపాపలతో సహా అందరూ తింటారు. పండ్లలోని పోషక విలువలు శరీరానికి మేలు చేస్తాయి.

Add Comment

Click here to post a comment