న్యూస్ లైఫ్ స్టైల్

Breaking News: రూ.35 లక్షల తో ప్రకాశం లో రోబోటిక్ పరిశోధనా కేంద్రం

తెలుగునంది ప్రకాశం జిల్లా: కళాశాల విద్యార్థుల కు ఆదునాతన పరిజ్ఞానాల ఫై శిక్షణ అందించటంలో ముందు వరుసలో ఉండే ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం మరిసారి ఆ దిశగా ముందడుగు వేసే క్రమంలో రోబోటిక్ పరిశోధనా కేంద్రాన్ని జర్మనీ ప్రభుత్వం సహకారంతో కళాశాల లొ నెలకొల్పనుందని కళశాల కరస్పాండెంటు డాక్టర్ కంచర్ల రామయ్య గారు తెలిపారు. ఈ మేరకు జర్మనీ లోని అఖెన్ ఆర్డబ్ల్యూ టి హెచె విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో యురోపియన్ సెంటర్ ఫర్ మెక్ట్రా ట్రానిక్స్ సంస్థ తోజర్మనీ పర్యటనలో ఉన్నకళాశాల ట్రెజరర్ కంచర్ల శ్రీకాంత్ ల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద పత్రాల ఫై శ్రీకాంత్, జర్మనీ సంస్థ ల తరపున డాక్టర్ టిల్కాజ్ స్ట్రిగ్, డాక్టర్ గేట్ , వంగపండు రాజ్ లు సంతకాలు చేశారు.

కళాశాల విద్యార్థులకు ఆటోమొబైల్, కంప్యూటర్ కెమికల్ తయారీ రంగాలలో రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఫై జర్మనీ దేశ శిక్షకులు కళాశాల లో విద్యార్ధులకు శిక్షణ అందిస్తారని రామయ్య గారు పేర్కొన్నారు. ఇప్పటికే కళాశాల లో నెలకొల్పిన ప్రఖ్యాతి సీమెన్స్ సంస్థ శిక్షణా కేంద్రం తోపాటువిద్యార్ధులకు ఒక అరుదైన వరంలాంటి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకొని కళాశాల కీర్తి ప్రతిష్టలుపెంచిన శ్రీకాంత్ ను అభినందిస్తూ యురోపియన్సెంటర్ ఫర్ మెక్ట్రాన్సిక్ సంస్థ కు రామయ్య గారు కృతజ్ఞతలు తెలియజేశారు.

#srikanthingermany

#srikanthingermany

Add Comment

Click here to post a comment