వీడియోస్

ఆందోళన వద్దు… చంద్రగ్రహణం రోజు ఇలా చేయండి

తెలుగునంది :  ఈనెల 27 వ, తేvదీ శుక్రవారం నాడు ఈ గ్రహణం మనకు ఎటువంటి చెడు చేస్తుందో? అని తలపోసే వారు ఉంటారు.
అందుకే అందరూ సులభంగా ఆచరించ తగినవి, ఎక్కువ ఖర్చు కానివి మన ఋషులు మనకు అందించిన నివారణోపాయాలని మీకు తెలియచెయ్యడం జరుగుతోంది.
ఇవన్నీ మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు.
గ్రహణంరోజు ఉదయం, రాత్రి రెండు పూటల స్నానం చెయ్యండి.
ఆ చేసేటప్పుడు ఆ నీటి లో ఆవుపాలు లేదా మాములుపచ్చి పాలు, గంధం, ఉంటే ముత్యం, శంఖం (ఈ రెండు మళ్ళి వాడుకోవచ్చు) ఒక తులసి ఆకు వేసి చెయ్యండి.
అలాగే గ్రహణానంతర స్నానం కుడా ఇలానే చెయ్యండి.
“ఓం సోమాయ సోమనాధాయ నమః “ఈ మంత్రం 10 సార్లు చదువుకోండి.

గ్రహణానికీ గంట ముందు లేదా గ్రహణ సమయం లో 108 లేదా వీలు అయినన్ని సార్లు
ఈ కింది మంత్రాలు చదువుకోండి
1)మేషరాశి :ఓం అంగారక మహీపుత్రాయ నమః
2) వృషభరాశి :ఓం నమో భార్గవాయ నమః
3)మిధున రాశి :ఓం నమోభగవతే వాసుదేవాయ నమః

4)కర్కాటక రాశి :ఓం సోమాయ సోమనాధాయ నమః
5)సింహరాశి :-ఓం సూర్యాయ సర్వ పాప హరాయ నమః
6)కన్యారాశి:- ఓం శ్రీం లక్ష్మిగణేశాయ నమః
7)తులారాశి :- ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఇంద్రాణి యే నమః

8)వృశ్చికరాశి :- ఓం శరవణ భవశరవణభవ సుబ్రహ్మణ్య స్వామిణే నమః
9)ధనస్సు రాశి :- ఓం ఐం హ్రీం క్లీం గురవే దత్తాత్రేయాయ నమః
10)మకరరాశి :- ఓం ఆంజనేయాయ మహాబలాయ హరిమర్కట మర్కటాయ నమః
11)కుంభ రాశి :- ఓం ధూం ధూం ధూమ వతి స్వాహా
12)మీన రాశి:ఓం హూం జుం భం కాలభైరవాయ నమః
గర్భిణులు చదవ వలసిన శ్లోకం
**************
దేవకీసుతం గోవింద వాసుదేవ జగత్పే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః
దేవ దేవ జగన్నాధ గోత్ర వృధ్ధి కరప్రభో
దేహి మే తనయం శీఘ్రం ఆయుష్మంతం యశస్వినం!

గ్రహణ స్పర్శ :రాత్రి :-11-54ని లకు↵సంపూర్ణ స్ధితి :రాత్రి :-01-01ని కు↵గ్రహణ మధ్య కాలం:రాత్రి :-01- 52ని కు↵గ్రహణ విడుపు :రాత్రి :-02-43ని కు↵ముగింపు లేదా మోక్ష కాలం :రాత్రి :-03 – 49 ని కు.