వీడియోస్

ఇకపై డ్రైవర్లకు బ్యార్జి లు అవసరం లేదు

తెలుగునంది గూడూరు : గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్లి నాన్ ట్రాన్స్ పోర్ట్, LMV నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహన దైవర్లు బ్యార్జీ లు లేక ఇబ్బందులు పడుతున్నారా…. పోలీస్ ల నుంచి ఎలా తప్పించుకోవాలని ఇబ్బందులు పడుతున్నారా…. ఇక వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు… మీడియం, హెవ్వీ వాహనాలు నడిపే డ్రైవర్లకు తప్ప ఆటోలు, ట్రాక్టర్లు,కార్లు, 13సీట్లు కలిగిన లైట్ మోటర్ వాహనాలు నడిపే డ్రైవర్లకు బ్యార్జీలు అవసరం లేదని సుప్రీమ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది… ఈ మేరకు గూడూరు రవాణా శాఖా కార్యాలయంలో ఆర్టీఓ చందర్ కోర్టు ఆదేశాలపై విలేఖర్లతో మాట్లాడారు… ఇకపై డ్రైవర్లకు బ్యార్జి లు అవసరం లేదన్నారు. అలాగే ఆటోలకు ప్రస్తుతం విధిస్తున్న పన్నులను సవరిస్తూ , జీవిత కాలపు పన్నును విధించినట్లు తెలిపారు,,, ఈ కార్యక్రమంలో ఏవో మధాని, ఇన్స్ పెక్టర్ ఆజాద్ జాకీర్ ఉన్నారు.