వీడియోస్

థాయ్ పిల్లలు 9 రోజులు ఆహారం లేకుండా ఎలా బతికారు?

తెలుగునంది ఇంటర్నేషనల్ న్యూస్: ఒక్క రోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి.. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు పిల్లలు.. అమ్మో పిల్లలు రోజంతా ఏమీ తినలేదా.. ఎలా బతుకుతాడమ్మా అంటూ చుట్టుపక్కల వారే కాదు అందరూ తిట్టిపోస్తారు.. అలాంటిది థాయ్ లాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు.. తొమ్మిది రోజులు ఎలాంటి ఆహారం లేకుండా ఎలా బతికారు అనేది ఇప్పుడు ప్రతి ఇంట చర్చ అయ్యింది. ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపుతోంది. గుహ నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన చిన్నారులు.. 9 రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఎలా ఉండగలిగారు.. వారిలో అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా సాధ్యం అయ్యింది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం ఏంటో తెలుసా.. ధ్యానం.. బుద్ధుడు ఈ ప్రపంచానికి నేర్పిన ధాన్యం.. ఇదే ఆ పిల్లలను కాపాడింది.
అండర్ 16 ఫుట్ బాల్ జట్టు. పిల్లలందరి వయస్సు 11 నుంచి 14 ఏళ్ల లోపే. వారికి ఫుట్ బాల్ కోచ్ గా ఎకపోల్ ఉన్నారు. ఆయన ఓ బౌద్ధ సన్యాసి. అందులోనూ అనాథ. ఈ దేశం సమాజం కోసమే అంటూ బతికేస్తారు. ఏదైనా సాధించాలనే తపన ఆయనలో ఉంది. అందులో భాగంగానే 25 ఏళ్ల వయస్సులోనే ఎకపోల్.. అండర్ 16 ఫుట్ బాల్ కోచ్ గా నియమితులు అయ్యారు. గుహలోకి వెళ్లిన తర్వాత వరదలు రావటంతో లోపలే చిక్కుకుపోయారు. పిల్లలను బతికించేందుకే బౌద్ధ సన్యాసి, కోచ్ అయిన ఎకపోల్.. పిల్లలతో ధ్యానం చేయించారు. శరీరంలోని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అని పాఠాలు చెప్పారు. ధైర్యం కోల్పోకుండా ఆధ్యాత్మిక ప్రభోదాలు చేశారు. ఒంట్లోని ఒక్కో అవయవం నుంచి శక్తిని తీసుకోవటం ద్వారా బతకొచ్చని.. పిల్లలతో ధ్యానం చేయించారు. కోచ్ ఎకపోల్ తన వెంట తీసుకెళ్లిన కొద్దిపాటి బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను పిల్లలకు పంచిపెట్టాడు. అందులో ఒక్క ముక్క కూడా అతను తీసుకోలేదు.
రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పిల్లలతో ధ్యానం చేయించారు. శరీరంలోని శక్తిని ఉపయోగించుకుంటూ.. ఆందోళన దూరం చేస్తూ వారిని కాపాడారు. ఒక్క రోజు ఆహారం తీసుకోకపోతే రాత్రికి నిద్రపట్టదు.. రెండో రోజుకి డల్ అయిపోతాం.. అలాంటిది 11 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను తొమ్మిది రోజులపాటు ఆహారం లేకుండానే ప్రాణాలు పోశాడు అంటే ఇది ఖచ్చింతంగా వింతే అంటున్నారు. కోచ్ ఎకపోలే ధ్యానంపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది.