వీడియోస్

ప్రళయ పెథాయ్ అప్‌డేట్స్: ఇవాళ మధ్యాహ్నం కాకినాడ దగ్గర తీరం దాటనున్న పెను తుఫాను

తెలుగునంది న్యూస్: పెథాయ్ తుఫానును ఎదుర్కోడానికి, సహాయక చర్యలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మొదలుకొని విద్యుత్తు, ఆరోగ్యం, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌, జలవనరులు, వ్యవసాయ, మత్స్యశాఖలతోపాటు ఇతర శాఖల ఉన్నతాధికారులంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలలో మోహరించారు. కంట్రోల్ రూముల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారులు 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా సహాయ, పునరావాస చర్యలపై అధికారులకు సూచనలిస్తూ, యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో తుఫాన్‌ సహాయ కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో పెథాయ్‌ తుఫాన్‌ సహాయ చర్యల కోసం ప్రత్యేక అధికారుల ఫోన్ నెంబర్లను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఆ నెంబర్లు ఇలా ఉన్నాయి.

మచిలీపట్నం- 08672 252486
గుడివాడ- 08674 243697
నూజివీడు- 08656 232717
విజయవాడ- 0866 2574454
కలెక్టరేట్‌- 1800 425 3077,
అమలాపురం ఆర్డీవో కార్యాలయం 08856 233208,
కాకినాడ ఆర్డీవో ఆఫీసు- 08842 368100

తూర్పు గోదావరి జిల్లా మత్సశాఖ కూడా 2502953, 9866606175, 7013930217 నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

విపత్తు సహాయ చర్యల కోసం పరిష్కార వేదిక 1100 ను సంప్రదించండి.