వీడియోస్

సత్య విద్యసంస్థల ఆధ్వర్యంలో ఉచిత నృత్య, గాత్రం, చిత్రలేఖనం శిక్షణా తరగతులు

తెలుగునంది విజయనగరం :  ప్రతిభకు పదును.. సృజనకు మెరుగు విజయనగరం సత్య డిగ్రీ మరియు పిజి. కాలేజీ లో వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులు ఉచిత నృత్య, గాత్రం, చిత్రలేఖనం శిక్షణా తరగతులు, అభిరుచులకు అనుగుణంగా పలు అంశాలపై మెలకువలు, వినియోగించుకుంటే భవిష్యత్తుకు బాటలు, మే 6 నుండి జూన్ 6  వరకు కొనసాగింపు.

ప్రతి మనిషిలో ఏదో ఒక సృజన దాగే ఉంటుంది. దానికి కొంచెం మెరుగు పడితే ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్నారులు చదువుతో పాటు ఆటపాటల్లో సమాంతరంగా రాణించినప్పుడే వారిలోని సృజనాత్మకత పదునెక్కి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం చేకూరుతుంది. వేసవి సెలవులు వృథా కాకుండా బాలబాలికల అభిరుచులకు అణుగుణంగా విజయనగరం,తోటపాలెం  సత్య డిగ్రీ & పిజి. కాలేజీ మరియు లిఫ్టింగ్ హాండ్స్ సేవసంస్థ ఆధ్వర్యంలో వివిధ కళలపై శిక్షణ తరగతులు ప్రారంభించారు. చిన్నారుల ప్రతిభాపాటవాలను వెలుగులోకి తీసుకొచ్చేలా ఆట, పాట, సంగీత, నృత్య కళారూపాల్లో శిక్షణనిస్తూ ప్రాచీన కళలకు జీవం పోస్తున్నారు. చిన్న వయస్సులో పలు సాంస్కృతిక అంశాలపై తర్ఫీదు పొందటం వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల, ఆలోచన శక్తి పెరుగుతుండటంతో తల్లిదండ్రులు తమ చిన్నారులకు శిక్షణ ఇప్పించడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అన్ని సత్య విద్యసంస్థ ల డైరెక్టర్ డాక్టర్. మ్. శశి భూషణరావు గారు తెలిపారు..

పిల్లల్లో సృజనాత్మకత, ఆలోచనాధోరణి, మానసిక ఎదుగుదలకు దోహదపడే అంశాలపై తర్ఫీదు ఇస్తున్నాం. పూర్తి వివరాలకు 8985693899, 9440114346 చరవాణి సంఖ్యలను సంప్రదించాలి.